ట్రక్‌పై మొబైల్ ఫుడ్ బిజినెస్ చేస్తోన్న మహిళ.. పెట్టుబడి పెడతానని ఆఫర్ ఇచ్చిన మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్
- కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శిల్ప
- ఆమె చేస్తోన్న బిజినెస్‌పై ఇటీవల మీడియాలో కథనాలు
- స్పందిస్తూ సాయం అందిస్తానన్న మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్
- రెండో అవుట్లెట్ పెట్టాలనుకుంటోన్న మహిళ
ఆమె తన సోదరుడికి కూడా సాయం చేసేందుకు రెండో అవుట్‌లెట్‌ను పెట్టాలనుకుందని తెలుసుకున్నానని ఆయన తెలిపారు. ఆమెకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ఆమె రెండో అవుట్లెట్ ప్రారంభించేందుకు పెట్టుబడి పెడతానని, ఈ విషయాన్ని ఆమెకు ఎవరైనా తెలియజేయండని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కాగా, హసన్ ప్రాంతానికి చెందిన శిల్ప తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. ఆమెకు పెళ్లి జరిగినప్పటికీ 2008లో ఆమె భర్త కనిపించకుండా పోవడంతో ఎవ్వరి మీదా ఆధారపడకుండా ఆమె ఈ బిజినెస్ చేసుకుంటోంది.