సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • వ్యాపారం చేసే ఉద్దేశం లేదన్న కాజల్ 
  • అమెరికాలో ప్రభాస్ శిక్షణ 
  • పోస్ట్ ప్రొడక్షన్ లో 'టచ్ చేసి చూడు' 
  • రానా సరసన కన్నడ భామ
*  తాను సినిమాలకు స్వస్తి చెబుతున్నట్టు వస్తున్న వార్తలను కాజల్ అగర్వాల్ ఖండించింది. 'నేను త్వరలో సినిమాలు వదిలేసి వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. సినిమాలు వదిలేసే ఉద్దేశం అసలు లేదు' అని కాజల్ తేల్చి చెప్పింది.
*  ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' తదుపరి షెడ్యూల్ షూటింగ్ జనవరి 5 నుంచి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద జరుగుతుంది. భారీ యాక్షన్ దృశ్యాలను అక్కడ చిత్రీకరిస్తారు. ఇందుకోసం హీరో ప్రభాస్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడట. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
*  రవితేజ హీరోగా విక్రం సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న 'టచ్ చేసి చూడు' చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. దీంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. రాశీఖన్నా, శీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
*  ప్రముఖ తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో రానా దగ్గుబాటి ఒక చారిత్రాత్మక చిత్రాన్ని చేయడానికి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కథానాయకుడుగా కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ ను తాజాగా ఎంపిక చేశారు.   
Kajal Agarwal
Prabhas
Raviteja
rana

More Telugu News