మళ్లీ రెచ్చిపోయిన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్!
- తిరిగి 15,000 డాలర్ల పైకి చేరిక
- ఒకే రోజు 8 శాతం పెరుగుదల
- సమీప కాలంలో మళ్లీ తగ్గే అవకాశం
మళ్ళీ ఈ ఒక్క రోజే 8 శాతం లాభపడి 15,032 డాలర్ల స్థాయికి చేరింది. ఇప్పటికీ ఇటీవలి గరష్ట స్థాయి నుంచి చూస్తే 23 శాతం తక్కువలోనే ట్రేడ్ అవుతోంది. స్వల్ప కాలంలో దీనికి 13,500 డాలర్ల స్థాయి మద్దతుగా ఉంటుందని, చికాగోకు చెందిన బెల్ కర్వ్ క్యాపిటల్ డైరెక్టర్ క్రిస్ గెర్ష్ తెలిపారు. ఫ్యూచర్ల కాంట్రాక్టుల్లో మరోసారి ఇది ఇటీవలి కనిష్ట స్థాయి (12,400 డాలర్ల స్థాయి) దిశగా పయనించే అవకాశం లేకపోలేదన్నారు.