గోవా బీచ్ లో సైకిల్ తొక్కుతూ ఆనందంగా గడుపుతున్న సోనియాగాంధీ... చిత్రం చూడండి!

పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడి భుజస్కంధాలపై వేసిన సోనియాగాంధీ, ఇప్పుడు గోవాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సేవలందించిన ఆమె, ప్రస్తుతం రిలాక్స్ అవుతూ దక్షిణ గోవాలోని ఓ రిసార్టులో కాలం గడుపుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల అనంతరం ఆమె తిరిగి ఢిల్లీ వెళతారని గోవా కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక గోవాలో ఉన్న సోనియా, అక్కడి బీచ్ లలో సైక్లింగ్ చేస్తుండగా, ఆమెతో పలువురు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. సోనియా సైతం ఓపికగా స్థానికులతో మాట్లాడుతూ, వారితో ఫొటోలు దిగుతున్నారు. రోజూ కాసేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపైనా నేతలతో చర్చిస్తున్నారు.

Sonia gandhi
Rahul Gandhi
Goa
Beach
Cycle

More Telugu News