ఆర్.కృష్ణయ్యకు షాక్.. గౌరవాధ్యక్షుడిగా తొలగించాలని నిర్ణయించిన బీసీ ఉద్యోగుల సంఘం

  • బీసీ సంఘాల నేతకు షాక్
  • గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగింపు
  • ఏపీ నేతనే తీసుకోవాలని కీలక నిర్ణయం
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యకు షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించాలని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఆయన స్థానంలో ఏపీకి చెందిన, ఏ రాజకీయ పార్టీకి చెందనటువంటి వ్యక్తిని నియమించాలని తీర్మానించింది.

విశాఖలోని ఇంజినీరింగ్ గెస్ట్ హౌస్ లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు అద్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సంఘం గౌరవాధ్యక్షుడిగా ఆర్.కృష్ణయ్యను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని శ్రీనివాసరావు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున హైదరాబాదులోని ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఆర్.కృష్ణయ్య గెలుపొందారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు.
Go Back to Shorts
r.krishnaiah
shock to r.krishnaiah

More Telugu News