బాయ్‌ఫ్రెండ్‌తో క్రిస్‌మ‌స్ వేడుక జ‌రుపుకున్న న‌య‌న‌తార‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాయ్‌ఫ్రెండ్‌తో క్రిస్‌మ‌స్ వేడుక జ‌రుపుకున్న న‌య‌న‌తార‌

  • ఫొటోలు షేర్ చేసిన విఘ్నేశ్ శివ‌న్‌
  • ప్రియురాలిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన ద‌ర్శ‌కుడు
  • ఆక‌ట్టుకుంటున్న ఫొటో
ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్‌, న‌టి న‌య‌న‌తార‌లు తమ మ‌ధ్య రిలేష‌న్ గురించి ఎన్న‌డూ బ‌య‌టికి చెప్ప‌లేదు. కానీ, వారి వ్య‌వ‌హారం చూసి వాళ్లిద్ద‌రినీ ప్రేమికులుగా మీడియా ఎప్పుడో ముద్ర వేసేసింది. ఇటీవల క్రిస్‌మ‌స్ సంద‌ర్భంగా విఘ్నేశ్ శివ‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు చూస్తే మీడియా వేసిన ముద్ర నిజ‌మే అయ్యుండొచ్చ‌న్న అనుమానం క‌లుగుతోంది.

వీరిద్ద‌రూ క‌లిసి క్రిస్‌మ‌స్ వేడుక‌లు జ‌రుపుకున్న ఫొటోల‌ను విఘ్నేశ్ షేర్ చేశాడు. ఆ ఫొటోలతో పాటు చేసిన పోస్టులో న‌య‌న్‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. న‌య‌న‌తార ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 14 ఏళ్లు గ‌డిచిన విష‌యాన్ని విఘ్నేశ్ గుర్తుచేశాడు. న‌య‌న‌తార మొద‌టి చిత్రం మ‌నసిన‌క్క‌రే క్రిస్‌మ‌స్ రోజునే విడుద‌లైందని, తామిద్దరం ఆనందంగా అదే క్రిస్‌మ‌స్ వేడుకను జ‌రుపుకున్నామని తెలిపాడు. ఆయ‌న షేర్ చేసిన ఫొటోల్లో అందంగా అలం‌క‌రించిన క్రిస్‌మ‌స్ ట్రీ, ఆ ప‌క్క‌నే వారి జంట‌ను చూడొచ్చు.
christmas
nayanathara
vignesh shivan

More Telugu News