తాను మాట్లాడుతుంటే ఇదేం పనంటూ చురకలంటించిన రామ్ నాథ్ కోవింద్!
- రాష్ట్రపతి ప్రసంగిస్తుండగానే ఆహార పొట్లాల పంపిణీ
- ఆహారం కోసం పరుగులు పెట్టిన ఆహూతులు
- వేదికపై నుంచే చురకలు అంటించిన రామ్ నాథ్
ఆహార పొట్లాల కోసం స్టూడెంట్స్ తో పాటు సదస్సుకు వచ్చిన వారు పరుగులు పెట్టడంతో సభ రసాభాసగా మారింది. రాష్ట్రపతి రామ్ నాథ్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇది జరగడంతో, ఆయన చురకలంటించారు. తన ప్రసంగానికి ఆటంకం కలిగించిన నిర్వాహకుల తీరును ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. ఫుడ్ ప్యాకెట్ల పంపిణీని కాసేపు ఆపాలంటూ వేదికపై నుంచే ఆయన కోరడం గమనార్హం. ఆహారాన్ని అందించడం తప్పు కాదని, అయితే, అది సభకు ఆటంకం కలిగించేలా ఉండ కూడదని హితవు పలికారు.