సొంతవాళ్లే మోసం చేశారు .. ఆకాశంలో నుంచి అగాధంలో పడిపోయాను: కమెడియన్ రఘు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొంతవాళ్లే మోసం చేశారు .. ఆకాశంలో నుంచి అగాధంలో పడిపోయాను: కమెడియన్ రఘు

  • బిజినెస్ పోయింది 
  • పొలం కూడా పోయింది 
  • షేర్ మార్కెట్ దెబ్బకొట్టింది
  • వాళ్ల వల్లనే కోలుకున్నాను  
జీవితంలో తనకి ఎదురైన ఒక చేదు సంఘటనను గురించి నటుడు రఘు .. ఐ డ్రీమ్స్ తో ఇలా చెప్పుకొచ్చారు. "నేను బాగుపడ్డాను అంటే అది నా ఫ్రెండ్స్ వల్లనే. వాళ్ల సహకారం వల్లనే నేను ఎదిగాను. ఉద్యోగాలు .. సినిమాల్లో అవకాశాలు స్నేహితుల వల్లనే వచ్చాయి. ఇక నాకు సాఫ్ట్ వేర్ కి సంబంధించి ఒక బిజినెస్ ఉండేది .. అలాగే షాద్ నగర్ దగ్గర కొంత పొలం ఉండేది. నేను బాగా ఎదుగుతున్న సమయంలో నా సొంత మనుషులే దెబ్బకొట్టారు. బిజినెస్ పోయింది .. పొలమూ పోయింది"

"అదే సమయంలో షేర్ బిజినెస్ లోను నష్టాలు వచ్చాయి. ఏం చేయాలో తెలియక మూడు నెలల పాటు గదిలో నుంచి బయటికి కూడా రాలేదు. ఇద్దరు ఆడపిల్లలు .. ఏంటి పరిస్థితి అనేది అర్థం కాలేదు. మా పేరెంట్స్ కి డౌట్ వచ్చి నా గురించి మా ఆవిడను అడిగి తెలుసుకున్నారు. ఆమె ద్వారా విషయం తెలుసుకుని మా ఇంటికి వచ్చి నాతోనే వున్నారు .. ఆ డిప్రషన్ లో నేను ఎక్కడ సూసైడ్ చేసుకుంటానోనని. అలా మా పేరెంట్స్ .. మా ఆవిడ నాకు అండగా నిలిచి మాములు మనిషిని చేశారు" అన్నారు.   
raghu

More Telugu News