డైరెక్టర్ యోగిని అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి కొట్టడానికి కారణం ఇదే!: నటి హారిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డైరెక్టర్ యోగిని అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి కొట్టడానికి కారణం ఇదే!: నటి హారిక

  • మహిళా పోలీసులను కూడా బెదిరించాడు
  • అడిషనల్ డీసీపీ ముందే నన్ను బూతులు తిట్టాడు
  • అందుకే ఆయన మూడు, నాలుగు సార్లు కొట్టారు
షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారికను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి వేధించిన కేసు విచారణ సందర్భంగా... యోగిని అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి బూటుకాలితో దారుణంగా తన్నిన వీడియో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై నటి హారిక స్పందించింది. తనతో అభ్యంతరకరంగా యోగి ప్రవర్తించాడని, ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని ఆమె తెలిపింది. తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది.

కొన్ని రోజుల క్రితమే యోగికి సంబంధించిన సీక్రెట్ అఫైర్స్ తనకు తెలిశాయని, తన వద్ద వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయని మీడియాకు ఆమె వివరించింది. ఈ నేపథ్యంలోనే తన వివరాలను ఎవరికీ చెప్పవద్దంటూ యోగి తనను బెదిరించాడని, హార్ట్ పేషెంట్ అయిన తన తండ్రిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని తెలిపింది. మూడు షార్ట్ ఫిలింలు చేసిన యోగిపై ఇప్పటికే కొన్ని కేసులు ఉన్నాయని... ఎంతో మందిని ఆయన వేధించినా, అతని గురించి ఎవరూ బయటపెట్టలేదని చెప్పింది. అతనికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కూతురు కూడా ఉందని తెలిపింది. ఫేస్ బుక్ ద్వారా తమకు పరిచయం ఏర్పడిందని చెప్పింది.

తనను వేధిస్తున్న యోగికి వార్నింగ్ ఇవ్వాలని మాత్రమే తాను పోలీసులను కోరానని హారిక తెలిపింది. ఈ విషయాన్ని రచ్చ చేయడం తనకు ఇష్టం లేదని, బూతు మెసేజ్ పంపించొద్దని అతనికి వార్నింగ్ ఇవ్వాలని మహిళా పోలీసులను కోరానని చెప్పింది. అతనికి తాను డబ్బు కూడా ఇచ్చానని తెలిపింది. ఆయనను పోలీస్ స్టేషన్ కు పిలిపించినందుకు మహిళా పోలీసులను కూడా యోగి బెదిరించాడని, తానో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నని, మీ అందరినీ రోడ్డు మీదకు లాగుతానని హెచ్చరించాడని చెప్పింది.

కోర్టు వరకు విషయాన్ని లాగుతానంటూ రెచ్చిపోయాడని, దీంతో అతన్ని అడిషనల్ డీసీపీ వద్దకు తీసుకెళ్లారని... ఆయన ముందు కూడా తనను తిట్టాడని, బూతులు ఉపయోగించాడని, 'డ్యాష్ ది, డ్యాష్ ది' అంటూ హీనంగా మాట్లాడాడని... అందుకే అడిషనల్ డీసీపీగారు యోగిని మూడు, నాలుగు సార్లు కొట్టారని తెలిపింది.
actress harika
director yogi

More Telugu News