బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ .. నో చెప్పేసిన విజయ్ దేవరకొండ?
Add ap7am to your home Screen

బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ .. నో చెప్పేసిన విజయ్ దేవరకొండ?

  • 'అర్జున్ రెడ్డి' హిట్ తో విజయ్ దేవరకొండకి క్రేజ్ 
  • చేతిలో అరడజనుకి పైగా సినిమాలు 
  • యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన 3 సినిమాలు
  • ఆసక్తిని చూపని విజయ్ దేవరకొండ
'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో తొలి హిట్ ను అందుకున్న విజయ్ దేవరకొండ, 'పెళ్లి చూపులు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా 'అర్జున్ రెడ్డి'  సినిమాతో ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అంతే, ఆయనకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో ఆయన ఓకే చేసిన ప్రాజెక్టులే అరడజనుకు పైగా వున్నాయి.

ఈ నేపథ్యంలో హిందీ నుంచి ఆయనకి భారీ ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్లో భారీ సంస్థగా చెప్పుకునే యష్ రాజ్ ఫిలిమ్స్ వారు, విజయ్ దేవరకొండతో వరుసగా 3 సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ ఆఫర్ ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్టుగా సమాచారం. డీల్ ఓకే అంటే ఆ మూడు సినిమాలు పూర్తయ్యేవరకూ మరో సినిమా చేయడానికి ఉండదట. అందువలన ఈ డీల్ విషయంలో విజయ్ దేవరకొండ ఆసక్తిని చూపించలేదని తెలుస్తోంది.       
vijay devarakonda

More Telugu News