విడాకులు తీసుకున్నప్పటికీ నేను,కీర్తిరెడ్డి ఇప్పటికీ మంచి స్నేహితులమే!: సుమంత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విడాకులు తీసుకున్నప్పటికీ నేను,కీర్తిరెడ్డి ఇప్పటికీ మంచి స్నేహితులమే!: సుమంత్

  • కీర్తిరెడ్డితో ఎలాంటి గొడవలు లేవు
  • ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం 
  • వాళ్ల ఫ్యామిలీలో అంతా నన్నెంతో అభిమానిస్తారు
సుమంత్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. నటనలో పరిణతిని కనబరుస్తూ వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కీర్తి రెడ్డికి తనకి గల విడాకుల గురించి ప్రస్తావించాడు. "పెళ్లి మీద నాకు పెద్ద అభిప్రాయమంటూ ఏమీ లేదు .. అది కొందరికి వర్కౌట్ అవుతుంది .. మరికొంతమందికి కాదు .. అంతే" అన్నారు.

 "ఏడాది పాటు కలిసి జీవించాం .. మా అభిప్రాయాలు కలవడం లేదని తెలుసుకున్నాం. విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చి విడిపోయాం .. అంతకి మించి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. విడిపోయినప్పటికీ కీర్తి .. నేను ఇప్పటికీ మంచి స్నేహితులమే .. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. వాళ్ల కుటుంబ సభ్యులంతా నన్ను బాగా అభిమానిస్తారు .. మా తాతగారు చనిపోయినప్పుడు కీర్తి వచ్చింది కూడా. ఇక నాగార్జున జోక్యం వల్లనే మేం విడిపోయామనే ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. కీర్తి బ్రదర్ కి .. నాగ్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ వుంది" అంటూ చెప్పుకొచ్చారు.    
sumanth
keerthi reddy

More Telugu News