హిందూపురంలో 'వైఎస్సార్ జ‌న‌తా క్యాంటీన్‌' ప్రారంభం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందూపురంలో 'వైఎస్సార్ జ‌న‌తా క్యాంటీన్‌' ప్రారంభం!

  • త‌క్కువ ధ‌ర‌కే అల్పాహారం, భోజ‌నం
  • పేద ప్ర‌జ‌లకు చేయూత కోసమే ఏర్పాటు
  • ఆర్థిక‌సాయం అందిస్తోన్న డాక్ట‌ర్ సాయిప్ర‌సాద్ మెమోరియ‌ల్ ట్ర‌స్ట్‌
జీవ‌నోపాధి కోసం ప‌ట్ట‌ణానికి వ‌స్తున్న పేద‌వారికి త‌క్కువ ధ‌ర‌కు భోజ‌న వ‌స‌తి క‌ల్పించాల‌నే ఉద్దేశంతో దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరిట జనతా క్యాంటీన్‌ను హిందూపురంలో ప్రారంభించారు. స్థానిక చిన్న మార్కెట్, ప్రభుత్వాసుపత్రి వద్ద క్యాంటిన్‌ కేంద్రాలను వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ప్రారంభించారు.

పేద ప్ర‌జ‌లు రోజంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు భోజనాలకే ఖర్చు పెట్టాల్సి వస్తోందని, వారికి చేయూత‌గా ఉండేందుకు ఈ క్యాంటీన్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ క్యాంటీన్ల ద్వారా అతి తక్కువ ధరకు అంటే రూ. 9కే కడుపు నిండా ఆహారం అందిస్తున్న‌ట్లు న‌వీన్ నిశ్చ‌ల్ పేర్కొన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణకు డాక్టర్‌ సాయిప్రసాద్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆర్థిక సాయం అందిస్తోంది.
hindupuram
ysrcp
naveen nischal

More Telugu News