పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

  • లోక్ సభ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం 
  • వారిని సభకు పరిచయం చేసిన ప్రధాని 
  • సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలి: మోదీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొంచెం సేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు నేటి నుంచి 14 రోజుల పాటు జరగనున్నాయి. లోక్ సభకు నూతనంగా ఎన్నికైన సభ్యులతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రమాణం చేయించారు. అనంతరం, సభకు నూతన సభ్యులను ప్రధాని మోదీ పరిచయం చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని, ప్రభుత్వం కీలక బిల్లులను సభముందు ప్రవేశ పెడుతుందని అన్నారు. అన్ని అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరగాలని కోరుకుంటున్నానని మోదీ అన్నారు.
శీతాకాల సమావేశాలు
లోక్ సభ

More Telugu News