ఎలా బయటపడాలో తెలియ‌క నానా అవ‌స్థలు ప‌డ్డ జింకపిల్ల‌.. వీడియో చూడండి!
Add ap7am to your home Screen

ఎలా బయటపడాలో తెలియ‌క నానా అవ‌స్థలు ప‌డ్డ జింకపిల్ల‌.. వీడియో చూడండి!

  • అమెరికాలోని ఒరెగాన్‌లో ఘ‌ట‌న‌
  • గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన‌ చెరువు మ‌ధ్య‌లో జింక‌పిల్ల‌
  • కాలు ముందుకు వేసి జారిపడిపోతోన్న జింక‌
అమెరికాలోని ఒరెగాన్‌లో ఓ జింక పిల్ల గడ్డకట్టుకుపోయిన నీటితో కూడిన చెరువు మధ్యలో చిక్కుకుపోయి బ‌య‌ట‌కు రావ‌డానికి నానా అవ‌స్థ‌లూ ప‌డింది. చివ‌ర‌కు ఓ వ్య‌క్తి దాన్ని ర‌క్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బ‌య‌టకు వ‌చ్చింది. గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన‌ ఆ చెరువు మ‌ధ్య‌లోకి ఆ జింక ఎలా వ‌చ్చిందో కానీ, అది కాలు ముందుకు వేసి న‌డుద్దామని ఎన్నో ప్ర‌యత్నాలు చేసింది.

కాలు ముందుకు వేయ‌గానే జారి ప‌డిపోయింది. ఇలా అనేకసార్లు ప్ర‌య‌త్నించింది. అడుగుతీసి అడుగు వేయ‌లేక‌పోతోన్న దాన్ని గుర్తించిన అక్క‌డి భ‌ద్రతా సిబ్బంది ఒక‌రు ఎట్ట‌కేల‌కు ఒడ్డుకు చేర్చారు. మీరూ చూడండి... 
Deer Rescued
on ice
Frozen Lake

More Telugu News