తెలుగుద‌నం ఉట్టిప‌డేలా కొన్ని చిత్రాలు ఇచ్చాను: అమ‌రావ‌తిలో రాజ‌మౌళి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగుద‌నం ఉట్టిప‌డేలా కొన్ని చిత్రాలు ఇచ్చాను: అమ‌రావ‌తిలో రాజ‌మౌళి

  • అసెంబ్లీ నిర్మాణం కోసం ఇచ్చే డిజైన్ కోసం ప‌ని చేయాల‌ని సీఎం చెప్పారు
  • ఒక డిజైన్ ఓకే అయింది.. అంద‌రికీ న‌చ్చింది
  • కొన్ని మార్పులు చేయాల‌ని సీఎం అడిగారు
  • నేను వ‌ర్క్ చేసిన డిజైన్ ఓకే కాలేదు
సినీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ రోజు అమ‌రావ‌తిలో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. రాజ‌ధాని డిజైన్ల కోసం సీఆర్డీఏ, నార్మ‌న్ ఫోస్ట‌ర్ అధికారుల‌తో ఆయ‌న చ‌ర్చించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ నిర్మాణం కోసం ఇచ్చే డిజైన్ కోసం ప‌ని చేయాల‌ని సీఎం చెప్పారని అన్నారు. ఒక డిజైన్ ఓకే అయిందని అది అంద‌రికీ న‌చ్చిందని కానీ, అందులో కొన్ని మార్పులు చేయాల‌ని సీఎం అడిగారని తెలిపారు. తెలుగుద‌నం ఉట్టిప‌డేలా తాను కొన్ని చిత్రాలు ఇచ్చానని తెలిపారు. తాను వ‌ర్క్ చేసిన ఓ డిజైన్ ఓకే కాలేదని చెప్పారు. 
amaravati
Rajamouli
designs

More Telugu News