అయితే 'జై లవకుశ'కి సంబంధించి అదంతా రూమరే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అయితే 'జై లవకుశ'కి సంబంధించి అదంతా రూమరే!

  • 'జై' పాత్ర మేకప్ కోసం వచ్చిన హాలీవుడ్ మేకప్ మేన్
  • ఆయన డిజైన్ చేసిన లుక్ ను వద్దనుకున్నారు 
  • ఆయనకి రెమ్యునరేషన్ ఇవ్వలేదని టాక్  
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో 'జై' పాత్ర లుక్ కాస్త విభిన్నంగా ..  వికృతంగా వుండాలని అనుకున్నారు. అందుకోసం హాలీవుడ్ నుంచి 'వాన్స్ హార్ట్ వెల్' అనే మేకప్ మేన్ ను రప్పించారు. ఆయన ఈ సినిమా కోసం ఇక్కడికి వచ్చి కొంతకాలం పనిచేశారు. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ 'జై' పాత్ర విషయంలో కల్యాణ్ రామ్ మనసు మార్చుకుని, 'వాన్స్ హార్ట్ వెల్' ను పంపించి వేశారు.

ఆయన డిజైన్ చేసిన లుక్ ను సినిమాలో వాడలేదనీ .. అసలు ఆయనకి పూర్తి ఎమౌంట్ కూడా ఇవ్వలేదనే టాక్ వచ్చింది. ఈ రూమర్స్ పై తాజాగా 'వాన్స్ హార్ట్ వెల్' స్పందించినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. "జై లవ కుశ' టీమ్ నన్నెంతో బాగా చూసుకుంది .. నా రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి వివాదం లేదు. కల్యాణ్ రామ్ చెప్పిన సమయానికి నా రెమ్యునరేషన్ ఇచ్చేశారు. ఎన్టీఆర్ చాలా మంచి మనిషి" అంటూ ఆయన చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.     
ntr
kalyan ram

More Telugu News