నటుడు విజయ్ ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్.. భార్య వేధింపులు.. పోలీసుల చేతిలో వీడియో!
Add ap7am to your home Screen

నటుడు విజయ్ ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్.. భార్య వేధింపులు.. పోలీసుల చేతిలో వీడియో!

  • ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
  • భార్యతో పాటు శశిధర్, అడ్వొకేట్ ల వేధింపులు
  • క్షోభను తట్టుకోలేకే ఆత్మహత్య
టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి యూసుఫ్ గూడలోని నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన భార్య వనిత వేధింపుల వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని అందరూ భావించారు. అయితే, ఈ ఆత్మహత్య కీలక మలుపు తిరిగింది. భార్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు విజయ్ ను వేధించినట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు విజయ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శశిధర్ అనే వ్యక్తి జోక్యం ఉందని వీడియోలో విజయ్ స్పష్టంగా తెలిపాడు.

మూడు సంవత్సరాల నుంచి తన భార్య నుంచి తాను విడిగా ఉంటున్నానని... తాను యూసుఫ్ గూడలో ఉంటుండగా, తన భార్య మణికొండలో ఉంటోందని విజయ్ చెప్పాడు. కొంత కాలం క్రితమే విడాకుల కోసం తన భార్య కోర్టులో పిటిషన్ వేసిందని, భరణం కూడా కోరిందని తెలిపాడు. ఈ రెండు కేసుల నుంచి బయటపడాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని చెప్పాడు. రూ. 3 కోట్ల వరకు డిమాండ్ చేసిందని తెలిపాడు. ఈ వ్యవహారానికి సంబంధించి శశిధర్ అనే వ్యక్తితో పాటు అడ్వొకేట్లు వేధింపులకు పాల్పడ్డారని చెప్పాడు. రెండు రోజుల క్రితం తన ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు, కారును కూడా తీసుకెళ్లారని... ఈ క్షోభను తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వీడియోలో చెప్పాడు. 
actor vijay
actor vijay suicide

More Telugu News