ఆర్కేన‌గ‌ర్లో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు.. త్వ‌ర‌లో నా రాజకీయ‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా!: సినీన‌టుడు విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్కేన‌గ‌ర్లో ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు.. త్వ‌ర‌లో నా రాజకీయ‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా!: సినీన‌టుడు విశాల్

  • ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఎవ్వ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు
  • ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయ‌డాన్ని కొన‌సాగిస్తా
  • ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తా
త్వ‌ర‌లో త‌న‌ రాజకీయ‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని సినీన‌టుడు విశాల్ తెలిపారు. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతితో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌డానికి విశాల్ నామినేష‌న్ వేయ‌గా, అందులో త‌ప్పులు ఉన్నాయ‌ని ఎన్నిక‌ల అధికారులు నామినేషన్ ను తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ ఎవ‌రైనా స్వ‌తంత్ర అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు తెలుపుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే, ఈ రోజు విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఎవ్వ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని పేర్కొన్నారు. తాను ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయ‌డాన్ని కొన‌సాగిస్తాన‌ని, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తాన‌ని చెప్పుకొచ్చారు. కాగా, విశాల్ నామినేష‌న్‌ను ఎన్నిక‌ల అధికారులు తిర‌స్క‌రించ‌డం ప‌ట్ల డీఎంకే నేత స్టాలిన్ అభ్యంత‌రం తెలిపారు. 
vishal
politics
rk nagar

More Telugu News