సెల్‌ఫోన్ పోగొట్టుకున్న మంత్రి హరీశ్ రావు.. స్వయంగా వెతికినా కనిపించని వైనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెల్‌ఫోన్ పోగొట్టుకున్న మంత్రి హరీశ్ రావు.. స్వయంగా వెతికినా కనిపించని వైనం!

  • కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలిస్తున్న సమయంలో పోయిన మొబైల్
  • వెనక్కి వచ్చి స్వయంగా వెతికిన మంత్రి
  • అయినా ఫలితం శూన్యం
గత కొన్ని నెలలుగా వార్తలకు దూరంగా ఉన్న తెలంగాణ మంత్రి టి.హరీశ్‌రావు తాజాగా వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ కాదు.. తన సెల్‌ఫోన్ పోగొట్టుకుని. గురువారం కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన తిరిగి వెళ్తూ తన మొబైల్‌ను పోగొట్టుకున్నారు.

కారులో కొంత దూరం వెళ్లిన తర్వాత ఫోన్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించిన మంత్రి తిరిగి వెనక్కి వచ్చారు. కారు దిగి స్వయంగా ఫోన్ కోసం చాలాసేపు వెతికారు. ఆయనకు సెక్యూరిటీ సిబ్బంది, ఇతర అధికారులు సాయం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నిరాశతో తిరిగి వెళ్లిపోయారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం ఆయన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించి వెళ్తున్న సమయంలో హరీశ్ తన మొబైల్‌ను పోగొట్టుకున్నారు.
Telangana
Harish Rao
Mobile

More Telugu News