పటేల్‌ ఉద్యమ నాయకుడు హార్థిక్‌ పటేల్ ఓ హోట‌ల్‌లో ఓ యువ‌తితో ఉన్న‌ట్లుగా ఇటీవ‌ల వ‌చ్చిన వీడియోలు క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డిన వేళ హార్థిక్ ప‌టేల్‌కు సంబంధించిన మ‌రిన్ని వీడియోలు వ‌చ్చాయి. కొత్త వీడియోల‌పై స్పందించిన హార్థిక్ ప‌టేల్‌.. అటువంటి వాటితో తనకు ఎలాంటి సమస్యలేదని అన్నారు. చూసేవారిని ఎందుకు వద్దనాలని, వారిని ఎంజాయ్‌ చేసుకోనివ్వండని చెప్పుకొచ్చారు. బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోంద‌ని, భవిష్య‌త్తులో మరిన్ని వీడియోలు రావ‌చ్చ‌ని అన్నారు. కాగా, గుజ‌రాత్‌లో తొలివిడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారం నేటితో ముగిసింది.