సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సాయిధరమ్ తేజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సాయిధరమ్ తేజ్

  • మాస్ మెచ్చిన డైరెక్టర్ వినాయక్ 
  • మాస్ హీరోగా సాయిధరమ్ తేజ్ కి క్రేజ్
  •  షూటింగు దశలో సినిమా 
  • ఈ సారి డీసెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు                  
హీరోలను సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా చూపించే కథల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తమ హీరోలను అలా చూడటానికి అభిమానులు కూడా ఆసక్తిని చూపుతున్నారు. 'నాయక్' సినిమాలో సాఫ్ట్ వేర్ ఫీల్డ్ కి చెందిన వ్యక్తిగానే చరణ్ కనిపించాడు. ఇక 'ఆర్య 2' సినిమాలో అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా సందడి చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తోన్న 'అజ్ఞాతవాసి' సినిమాలోను పవన్ కల్యాణ్ పాత్ర సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానే ఉండనుంది.

 ఇక సాయిధరమ్ తేజ్ కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానే పలకరించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా చేస్తున్నాడట. ఇలా మెగా హీరోలంతా ఒకరి తరువాత ఒకరుగా సాఫ్ట్ వేర్ పాత్రలను ఎంచుకోవడం విశేషం. మొదటి నుంచి మాస్ లుక్ తో తెరపై సందడి చేస్తూ వస్తోన్న తేజు, ఈ సినిమాలో క్లాస్ లుక్ తో ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తాడో చూడాలి.                
sai dharam tej

More Telugu News