చిరంజీవిని మోసం చేసిందే పవన్ కల్యాణ్, అల్లు అరవింద్... ముందు అన్నను క్షమించమని వేడుకో!: పవన్ కు రోజా సలహా
Add ap7am to your home Screen

చిరంజీవిని మోసం చేసిందే పవన్ కల్యాణ్, అల్లు అరవింద్... ముందు అన్నను క్షమించమని వేడుకో!: పవన్ కు రోజా సలహా

  • ముందు నిన్ను నువ్వు శిక్షించుకో
  • అందరూ కలిసి చిరంజీవిని నాశనం చేశారు
  • 18 సీట్లు మాత్రమే గెలిచాడనగానే గాల్లో వదిలేశావు
  • వైకాపా నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు
చిరంజీవిని మోసం చేసింది పవన్ కల్యాణేనని రోజా ఆరోపించారు. చిరంజీవికి అన్యాయం చేసినందుకు పవన్ కల్యాణ్ ముందు తనను తాను శిక్షించుకోవాలని డిమాండ్ చేశారు. తన అన్న చిరంజీవిని క్షమించమని వేడుకోవాలని కోరారు. "మా అన్న చిరంజీవిగారికి మోసం చేసిన వారిని వదిలిపెట్టను అంటున్నాడు. మీ అన్నకు ద్రోహం చేసిన వాళ్లలో మొదట నువ్వున్నావు పవన్ కల్యాణ్, నెక్ట్స్ మీ బావ అయిన అల్లు అరవింద్ ఉన్నారు. ఆ తరువాత చంద్రబాబు, ఆయన చానల్స్ ఉన్నాయి.

మీరందరూ కలిసి చిరంజీవిని నాశనం చేసి ఇంటికి పంపించి, ఈరోజు ఎవరో చేశారని వాళ్లను వదిలిపెట్టను అంటే హాస్యాస్పదంగా ఉంది. మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడని భావించి, పరిగెత్తుకు వచ్చి, నువ్వు యువనేతగా ప్రచారం చేశావు. మీ అన్న 18 సీట్లు మాత్రమే గెలిచాడనగానే, మీ అన్నను గాల్లోకి వదిలేసి, నీ పాటికి నువ్వు షూటింగ్ లకు వెళ్లి అన్యాయం చేశావు. ముందు నిన్ను నువ్వు శిక్షించుకో" అని విమర్శలు గుప్పించారు.
 
"ఈ రోజు పవన్ కల్యాణ్ మాట్లాడే మాటలకు, చేతలకు సంబంధం లేదండి. కృష్ణానదిలో ఓ బోటు బోల్తా పడిందన్న విషయం ఎక్కడో లండన్ లో ఓ విద్యార్థి చెబితే తెలిసిందంటే, అంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందాండీ? ఒక పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడుతాను, ప్రశ్నిస్తానన్న పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో ఉంటూ, నాకు తెలియలేదు, ఎవరో అడిగితే ఆలోచిస్తున్నాను అంటున్నారు. మొన్నటి పేపర్లు చూడండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది మహిళలను వ్యభిచార కూపంలోకి దించేదాంట్లో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అంటే సిగ్గుచేటు... ఈ ప్రభుత్వానికి, దాన్ని సపోర్టు చేస్తున్న పవన్ కల్యాణ్ కు. మరి ఈయనకు ఆడవారి మీద గౌరవం లేదా?" అని ప్రశ్నించారు.

Roja
Pawan Kalyan
Chandrababu
Chiranjeevi

More Telugu News