ఆడియో ఫంక్షన్స్ కి వెళ్లడం ఇష్టం ఉండదు: శేఖర్ కమ్ముల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆడియో ఫంక్షన్స్ కి వెళ్లడం ఇష్టం ఉండదు: శేఖర్ కమ్ముల

  • సినిమా చూసిన తరువాత మాట్లాడమంటే మాట్లాడతాను 
  • నచ్చినా నచ్చకపోయినా చెప్పేస్తాను 
  • నచ్చిన విషయాలు మాత్రమే చెప్పాలంటే నా వల్ల కాదు  
టాలీవుడ్ దర్శకులలో శేఖర్ కమ్ములకు ప్రత్యేకమైన స్థానం వుంది. ఆయన ఎంత సింపుల్ గా కనిపిస్తూ వుంటారో, ఆయన కథాకథనాలు అంత బలంగా ఉంటాయి. అంతే బలంగా అవి యూత్ హృదయాలను కొల్లగొట్టేస్తూ ఉంటాయి. అలాంటి శేఖర్ కమ్ముల .. సినిమా ఫంక్షన్స్ లో పెద్దగా కనిపించరు. అలాగే ఇతర దర్శక నిర్మాతలతో సాన్నిహిత్యాన్ని కలిగి వున్నట్టుగా కూడా అనిపించరు. ఇదే విషయానికి సంబంధించిన ప్రశ్న ఆయనకి తాజాగా ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది.

 అప్పుడాయన స్పందిస్తూ .. " మీరు చెప్పింది నిజమే నేను సినిమా ఫంక్షన్స్ లో పెద్దగా కనిపించను. ఎందుకంటే నా అభిరుచులు .. అభిప్రాయాలు వేరు. ఇక ఆడియో ఫంక్షన్స్ కి వెళ్లడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు .. ఎందుకంటే అక్కడ ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. సినిమా చూసిన తరువాత దాని గురించి చెప్పమంటే చెబుతాను. నచ్చితే నచ్చిందనీ .. నచ్చకపోతే నచ్చలేదని అంటాను. నచ్చని విషయాలను మనసులో పెట్టుకుని .. నచ్చిన విషయాలనే గొప్పగా చెప్పాలంటే మాత్రం నా వల్ల కాదు" అంటూ సమాధానమిచ్చారు.   
sekhar kammula

More Telugu News