కల్యాణ్ కృష్ణతోనే రంగంలోకి దిగుతోన్న రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కల్యాణ్ కృష్ణతోనే రంగంలోకి దిగుతోన్న రవితేజ

  • 'టచ్ చేసి చూడు'తో బిజీగా రవితేజ
  • తరువాత సినిమా కల్యాణ్ కృష్ణతో 
  • ఆలస్యం కానున్న శ్రీను వైట్ల ప్రాజెక్టు  
ప్రస్తుతం రవితేజ .. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' సినిమా చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా .. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఇద్దరిలో శ్రీను వైట్ల ప్రాజెక్ట్ ముందుగా సెట్స్ పైకి వెళుతుందంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి.

అయితే కల్యాణ్ కృష్ణ సినిమానే ముందుగా సెట్స్ పైకి వెళుతుందనేది తాజా సమాచారం. రేపుగానీ .. ఎల్లుండి గాని ఈ సినిమాను ఎనౌన్స్ చేసే ఛాన్స్  ఉందని అంటున్నారు. వెంకట్ తలారి .. రామ్ తాళ్లూరి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కథానాయికతో పాటు మిగతా నటీనటులు ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక శ్రీను వైట్ల తన సినిమా కోసం అమెరికాలో లొకేషన్ల వేటలో ఉన్నాడనే సంగతి తెలిసిందే. కాస్త ఆలస్యంగా ఆయన ప్రాజెక్టు కూడా పట్టాలెక్కనుందన్న మాట.        
raviteja
kalyan krishna

More Telugu News