సెట్లో ఎన్టీఆర్ అలా వుంటే .. ఏఎన్నార్ ఇలా ఉండేవారు: జమున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెట్లో ఎన్టీఆర్ అలా వుంటే .. ఏఎన్నార్ ఇలా ఉండేవారు: జమున

  • సెట్లో ఎన్టీఆర్ సీరియస్ గానే ఉండేవారు 
  • జోకులు వేయడం వంటివి చేసేవారు కాదు 
  • నటన పరంగా సూచనలు చేసేవారు 
  • ఇక నాగేశ్వరరావు సెట్లో వుంటే అంతా సందడే
ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో కలిసి జమున అనేక చిత్రాలలో నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆమె చేసిన సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్ .. ఏఎన్నార్  సెట్లో ఎలా ఉండేవారు? అనే ప్రశ్న ఆమెకి తెలుగు పాప్యులర్ టీవీ ఇంటర్వ్యూలో ఎదురైంది.

అప్పుడామె స్పందిస్తూ .. " సెట్లో రామారావుగారు ఉంటే అంతా నిశ్శబ్దంగా ఉండాల్సిందే. ఇక భావోద్వేగాలకు సంబంధించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే, ఆయనతో పాటు మేమంతా అదే మూడ్ లో ఉండేవాళ్లం. జోకులు వేయడం .. హీరోయిన్స్ తో కలిసి నవ్వుతూ మాట్లాడటం చేసేవారు కాదు. అవసరమైతే కో ఆర్టిస్టులకు సూచనలు చేసేవారు .. అంతే.

ఇక నాగేశ్వరరావు అయితే సెట్లో ఎంతో జోవియల్ గా ఉండేవారు .. షూటింగులో వున్నట్టుగా ఉండదు. సరదాగా అందరినీ ఆటపట్టిస్తూ ఉండేవారు. 'కీలు గుర్రం' సినిమా విశేషాలు చెబుతూ .. ఆ సినిమా షూటింగు సమయంలో తాను పడిన ఇబ్బందులను చెబుతూ నవ్విస్తూ ఉండేవారు" అని చెప్పుకొచ్చారు.         
jamuna
akkineni
ntr

More Telugu News