46 సార్లు ఎముకలు విరగ్గొట్టుకున్నా: ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్

తనకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎంతో మంచి అనుబంధం ఉందని, ఆయన్ను తాను డాడీ అని పిలుస్తానని ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ వ్యాఖ్యానించారు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రేక్షకులను సంతృప్తి పరచడానికే తాను నిత్యమూ ప్రయత్నిస్తుంటానని చెప్పారు. ఫైట్స్ కంపోజింగ్ విషయంలో చాలా సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని, జాకీ చాన్ కు 52 సార్లు ఎముకలు విరిగితే, తనకు 46 సార్లు విరిగాయని అన్నారు.

సెట్స్ లో తానెంతో కఠినంగా ఉంటానని, నిజ జీవితంలో మాత్రం సాధారణ వ్యక్తినేనని చెప్పారు. సినిమా కథ డిమాండ్ మేరకు వచ్చే ఫైట్స్ ను బాగా చిత్రీకరించవచ్చని, కృతకంగా పెట్టాలని ఫైట్ పెడితే మాత్రం వాటిని తాను వ్యతిరేకిస్తుంటానని చెప్పాడు. హాలీవుడ్ తో పోలిస్తే భారత సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు వాస్తవానికి దూరంగానే ఉంటాయని, ఇక్కడి సంస్కృతి, చూసేవారి అంచనాలకు తగ్గట్టుగా ఫైట్స్ డిజైన్ చేస్తుంటామని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Peter Heins
Fight Master
Trivikram Srinivas

More Telugu News