'మెర్సల్' హిట్ .. కానీ నష్టం 60 కోట్లు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మెర్సల్' హిట్ .. కానీ నష్టం 60 కోట్లు?

  • దీపావళి కానుకగా వచ్చిన 'మెర్సల్' 
  • భారీ వసూళ్లంటూ ప్రచారం 
  • నష్టాలే వచ్చాయంటూ లేటెస్ట్ టాక్ 
  • అయోమయంలో అభిమానులు    
విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన 'మెర్సల్' .. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించగా, ఆయన సరసన ముగ్గురు కథానాయికలు నటించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి భారీ వసూళ్లను రాబట్టింది. 250 కోట్ల వరకూ ఈ సినిమా వసూలు చేసినట్టుగా ప్రచారం జరగడంతో, విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిందని అభిమానులు సంతోష పడిపోయారు.

 అయితే తాజాగా చెన్నైలో షికారు చేస్తోన్న ఒక వార్త వాళ్లకి నిరాశను కలిగిస్తోంది. ఈ సినిమా లాభాలు సాధించిందనే విషయంలో నిజం లేదనీ, భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిందనే టాక్ వినిపిస్తోంది. సినిమా మంచి వసూళ్లను సాధించిన మాట నిజమే గానీ, అనవసరమైన ఖర్చులను పెంచుకుంటూ పోవడం వలన 60 కోట్ల వరకూ నష్టం వచ్చిందనే వార్త షికారు చేస్తోంది. ముందుగా చెప్పినట్టు లాభాలు వచ్చిన మాట నిజమా? 60 కోట్లు నష్టమంటూ తాజాగా హల్ చల్ చేస్తోన్న వార్త నిజమా? అనే విషయంలో అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు.      
vijay
samanta
kajal

More Telugu News