Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవాంకా పర్యటన షెడ్యూల్ మొత్తాన్ని గోప్యంగానే ఉంచారు!: కేసీఆర్

  • ఇవాంకా టూర్ షెడ్యూల్ ఆద్యంతం రహస్యం
  • వెస్టిన్ హోటల్ అన్నారు ట్రైడెంట్ కి మార్చారు 
  • ఎలాంటి పర్యటన లేదన్నారు గోల్కొండ కోట చూశారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ పర్యటన షెడ్యూల్ ఆద్యంతం రహస్యంగానే ఉంచారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇవాంకా కదలికలపై అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు చివరి క్షణంలోనే రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చేవారని అన్నారు. తొలుత ఇవాంకా ప్రత్యేక విమానంలో వస్తారని చెప్పారని, అయితే ఆమె అందుకు భిన్నంగా సాధారణ విమానంలో వచ్చారని తెలిపారు. అలాగే ముందుగా ఆమె వెస్టిన్ హోటల్లో బస చేస్తారని చెప్పారు, కానీ ఆమె బసను ట్రైడెంట్‌ హోటల్ కు మార్చారని ఆయన గుర్తుచేశారు.

 అలాగే ఆమె గోల్కొండ కోట సందర్శన చివరి క్షణం వరకూ గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ భద్రతా వ్యూహాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు కూడా పనిచేశారని ఆయన అభినందించారు. జీఈఎస్ విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించారని ఆయన తెలిపారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేశాయని, దీంతో హైదరాబాదు పేరు ప్రతిష్ఠలు ప్రపంచవ్యాప్తమయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 
ivanka trump
KCR
ivanka tour
ivanka tour secret

More Telugu News