ప్రియుడ్ని తల్లికి పరిచయం చేసిన శ్రుతిహాసన్.. ఇక పెళ్లే తరువాయి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియుడ్ని తల్లికి పరిచయం చేసిన శ్రుతిహాసన్.. ఇక పెళ్లే తరువాయి!

  • గత కొంత కాలంగా డేటింగ్ లో శ్రుతి హాసన్
  • లండన్ నటుడు మైఖేల్ కోర్సేల్ తో డేటింగ్
  • ఎట్టకేలకు ప్రియుడిని తల్లికి పరిచయం చేసిన ముద్దుగుమ్మ 
ప్రముఖ నటుడు కమలహాసన్ కుమార్తె శ్రుతి హాసన్ లండన్ కి చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమాయణంపై పలుమార్లు మీడియాలో వార్తలు రాగా, అవన్నీ రూమర్లు అంటూ ఈ ముద్దుగుమ్మ కొట్టిపడేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది రూమర్ కాదని, సీరియస్ రిలేషన్ షిప్ అని తెలుస్తోంది.

ఈ మధ్యే శ్రుతిహాసన్ తన తల్లి సారికకు కోర్సేల్ ను పరిచయం చేసిందట. విశాల భావాలు కలిగిన తల్లిదండ్రులిద్దరి మద్దతు శ్రుతిహాసన్ కు లభించిందని, దీంతో ఇక మిగిలింది వివాహమేనని కోలీవుడ్ మీడియా చెబుతోంది. 
shruti hassan
dating
actress love

More Telugu News