గోల్కొండలో ఇవాంకా.. చారిత్రక కట్టడాలను ఆసక్తిగా చూస్తున్న వైనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోల్కొండలో ఇవాంకా.. చారిత్రక కట్టడాలను ఆసక్తిగా చూస్తున్న వైనం!

  • నడుస్తూ గోల్కొండను వీక్షిస్తున్న ఇవాంకా
  • విందు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • అరగంటలో ఇవాంక బయటకు వచ్చే అవకాశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ గోల్కొండ కోటకు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య ఆమె చారిత్రక ప్రదేశానికి వచ్చారు. ఇవాంకతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శి వచ్చారు. మరోవైపు, సెక్యూరిటీ కారణాల వల్ల ఇవాంకా చార్మినార్ ను, గాజుల బజార్ ను సందర్శించని సంగతి తెలిసిందే. దీంతో, గోల్కొండ వద్ద ఆమె కోసం కొన్ని గాజుల స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు.

అలాగే ప్రభుత్వ పని తీరును తెలియజేసే 12 స్టాల్స్ ను ఏర్పాటు కూడా చేశారు. ఇవాంకా కోసం కోటలో బ్యాటరీ కార్లను ఏర్పాటు చేశారు. అయితే, ఆమె నడుచుకుంటూనే గోల్కొండ కోటలోని చారిత్రక కట్టడాలను తిలకిస్తున్నట్టు సమాచారం. కోటలో ఆమె కేవలం 20 నిమిషాల నుంచి అరగంట సేపు మాత్రమే ఉంటారని చెబుతున్నారు.  

గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు సాయంకాలం విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ విందులో ముఖ్యంగా తెలంగాణ రుచులను రుచి చూపించబోతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగుర వేసే ప్రాంతంలో విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే, ఈ విందులో ఇవాంకా పాల్గొనక పోవచ్చని సమాచారం.
ivanka trump
golkonda fort
ivanka in golkonda

More Telugu News