Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిస్ యూనివ‌ర్స్ 2017 పోటీల్లో భార‌త్‌కి చుక్కెదురు

  • టాప్ 16కి చేరుకోలేక పోయిన భార‌త సుంద‌రి శ్ర‌ద్ధ శ‌శిధ‌ర్‌
  • విజేతగా నిలిచిన‌ ద‌క్షిణాఫ్రికా సుంద‌రి డెమీ లే నెల్ పీట‌ర్స్‌
  • లాస్ వేగాస్‌లో జ‌రిగిన పోటీలు
మిస్ వ‌ర‌ల్డ్ 2017 పోటీల్లో భార‌త సుంద‌రి మానుషీ చిల్ల‌ర్ కిరీటం సాధించ‌టంతో, మిస్ యూనివ‌ర్స్ 2017 పోటీల్లో పాల్గొన్న భార‌త సుంద‌రి శ్ర‌ద్ధ శ‌శిధ‌ర్ కూడా కిరీటాన్ని తీసుకువ‌స్తుంద‌ని భార‌తీయులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ శ్ర‌ద్ధ, టాప్ 16కి కూడా చేరుకోలేక‌పోయింది. టాప్ 16 ఎంపిక‌లో ఆసియా ప‌సిఫిక్ కేట‌గిరీ నుంచి థాయ్‌లాండ్‌, శ్రీలంక‌, ఘ‌నా, ద‌క్షిణాఫ్రికా సుంద‌రీమ‌ణులు ఆమెకు గ‌ట్టిపోటీనిచ్చారు.

లాస్‌వేగాస్‌లో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 92 మంది సుంద‌రీమ‌ణులు పాల్గొన‌గా వారిలో ద‌క్షిణాఫ్రికాకు చెందిన డెమీ లే నెల్ పీట‌ర్స్ కిరీటాన్ని ద‌క్కించుకుంది. 2000 సంవ‌త్స‌రంలో లారా ద‌త్తా త‌ర్వాత మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో భారత సుంద‌రీమ‌ణులు కిరీటాన్ని సంపాదించ‌లేక‌పోయారు.
miss universe 2017
shraddha shasidhar
south africa

More Telugu News