చంద్రబాబు మా సోదరులకు మంత్రి పదవులు ఇవ్వరు... ఆ సంగతి నాకు తెలుసు: జేసీ దివాకర్ రెడ్డి
Add ap7am to your home Screen

చంద్రబాబు మా సోదరులకు మంత్రి పదవులు ఇవ్వరు... ఆ సంగతి నాకు తెలుసు: జేసీ దివాకర్ రెడ్డి

  • 2019లో పోటీ చేయవద్దని చెబుతారేమో
  • కరివేపాకులా పక్కన పడేశారు
  • రాజకీయాలు కలుషితం అయ్యాయి
  • ఓ ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి
తనకుగానీ, తన సోదరుడికిగానీ మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావించడం లేదని, ఆ విషయం తనకు స్పష్టంగా తెలుసునని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, వచ్చే ఎన్నికల్లో తమ అన్నదమ్ములను ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు అంటారేమోనన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.

 కేంద్రంలో తనకుగానీ, రాష్ట్రంలో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డికిగానీ మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని అన్నారు. తమను కూరలో వాడుకుని, ఆపై పక్కన పడేసే కరివేపాకులా చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయాలు కలుషితం అయ్యాయని, ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచిన తాను ప్రస్తుత పరిస్థితి చూసి చలించి పోతున్నానని అన్నారు. అందరూ అవినీతి పరులేనని, తాను మాత్రం అవినీతికి దూరమని అన్నారు. రాజకీయ నాయకుడిగా కమిషన్లకు ఎన్నడూ కక్కుర్తి పడలేదని చెప్పారు. తానెన్నడూ హత్యలు చేయలేదని, చేయించలేదని, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాను దూరమని అన్నారు.
Chandrababu
jc diwakar reddy

More Telugu News