గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇదే!
Add ap7am to your home Screen

గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇదే!

  • టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి
  • పాడేరు అభివృద్ధికి కృషి చేస్తా
  • ఈశ్వరికి హామీ ఇచ్చిన చంద్రబాబు
  • అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా!
వైకాపా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెను సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు, పచ్చకండువాను కప్పారు. అభివృద్ధికి దూరంగా ఉన్న పాడేరు నియోజకవర్గానికి మరిన్ని నిధులను కేటాయించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని తెలిపారు. కాగా, 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.
Chandrababu
giddi eshwari

More Telugu News