సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

27-11-2017 Mon 07:29 | Entertainment
  • రకుల్ హిందీ సినిమా రిలీజ్ డేట్ ఖరారు 
  • పాటల కోసం దుబాయ్ వెళుతున్న 'జైసింహా'
  • ప్రభాస్ తో కలసి చేస్తానంటున్న గోపీచంద్ 
  • దర్శకుడిగా మారిన మరో రచయిత
*  ఇటు తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూనే అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల హిందీలో 'ఆయారే' అనే చిత్రంలో నటించింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు.
*  బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జైసింహా' చిత్రం షూటింగుకు సంబంధించి ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలివుంది. డిసెంబర్ 7 నుంచి 17 వరకు ఈ పాటలను దుబాయ్ లో చిత్రీకరిస్తారు. వీటిలో ఓ పాటను బాలయ్య, నయనతారలపైనా, మరో పాటను బాలయ్య, నటాషా లపైనా చిత్రీకరిస్తారు.  
*  తన మిత్రుడు ప్రభాస్, తాను కలసి ఓ చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే మంచి కథ దొరకడం లేదని చెప్పాడు యాక్షన్ హీరో గోపీచంద్. ఇద్దరికీ సూటయ్యే కథ కోసం వెయిట్ చేస్తున్నామని అన్నాడు. కాగా, వీరిద్దరూ కలసి గతంలో 'వర్షం' సినిమాలో నటించిన సంగతి విదితమే.
*  ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారాడు. ఆయన దర్శకత్వంలో రూపొందే 'బృందావనమది అందరిది' చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నూతన నటీనటులు నటించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును వచ్చే నెల 20 నుంచి కేరళలో నిర్వహిస్తామని దర్శకుడు చెప్పాడు.
RakulBalakrishnaPrabhasGopichand

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more