బెంగళూరులో కీచక పర్వం.. ఇళ్లలోకి ప్రవేశించి సామూహిక అత్యాచారాలు!

26-11-2017 Sun 06:54 | National
  • ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం
  • ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలే టార్గెట్ 
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
బెంగళూరులో కీచకులు రెచ్చిపోయారు. ఇళ్లలో ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ నెల 16న నగర శివారులోని నెలమంగళకు సమీపంలో ఉండే మాదనాయకహళ్లికి చెందిన కార్మికురాలిపై అత్యాచారం జరిగింది. ఆమె భర్త బయటకు వెళ్లిన విషయాన్ని గ్రహించిన రాజగోపాల్ నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రాఘవేంద్ర అలియాస్ కుమార్ (32), లగ్గెరెకు చెందిన పునీత్ (22), లక్ష్మీపురానికి చెందిన వెంకటేశ్‌తోపాటు మరో ఇద్దరు కలిసి ఆమె ఇంట్లోకి ప్రవేశించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

తాజాగా శుక్రవారం రాత్రి నేపాల్ యువతిపై ఆరుగురు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న పాడుబడిన ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి  పాల్పడ్డారు. అనంతరం ఆమె కాళ్లు కదపకుండా పెద్ద బండరాయిని ఉంచి పరారయ్యారు. ఉదయం ఆమె కేకలు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, రాఘవేంద్రపై హత్య, హత్యాయత్నం, దోపిడీలకు సంబంధించి పది కేసులు ఉన్నాయి.
BangalorepoliceGang Rape

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more