ఈ-గవర్నెన్స్ యాప్ ఉమంగ్ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్లలో లభ్యం
- డిజిటల్ ఇండియాలో భాగంగా యాప్ ఆవిష్కరణ
- అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఒకే యాప్లో
ఆండ్రాయిడ్ ప్లేస్టోర్, ఐఓఎస్ స్టోర్, విండోస్ స్టోర్లలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఆధార్, డిజి లాకర్లతో పాటు స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. 9718397183 నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.