ఒకేసారి 8 స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తున్న జియోనీ.. 6జీబీ ర్యామ్‌తో అదిరిపోయే ఫీచర్లు!
- ఈ నెల 26న మార్కెట్లోకి..
- అదిరిపోయే ర్యామ్.. అద్భుతమైన ఫీచర్లు!
- వివరాలు వెల్లడించని జియోనీ
ఫోన్ మోడళ్ల గురించి మాత్రమే వెల్లడించిన సంస్థ ఫీచర్ల వివరాలు వెల్లడించలేదు. అయితే లీకైన సమాచారం ప్రకారం ఎస్ 11 మోడల్.. 5.99 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ, 16 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఎఫ్ 205 మోడల్.. 5 అంగుళాల డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 8 ఎంపీ రియర్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ధర వివరాలు మాత్రం బయటకు పొక్కలేదు. డిస్‌ప్లే, ర్యామ్, ఇంటర్నల్ మెమొరీలో కొద్దిపాటి మార్పులతో మొత్తం 8 ఫోన్లు దాదాపు ఇలానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.