Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్‌ అభిమానులకు చేదువార్త.. రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటన!

  • రాజ‌కీయాల్లోకి రావ‌డం లేద‌ని ర‌జ‌నీ ప్ర‌క‌ట‌న‌
  • ‘2.ఓ’ సినిమా విడుదలైన త‌రువాత మరోసారి ఫ్యాన్స్‌తో భేటీ అవుతా
  • కొత్త‌గా ఏ రంగంలోకీ దిగడం లేదు
సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఎప్పుడెప్పుడా అని ఆయ‌న అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తోన్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అభిమానులు కొండంత ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్  ‘2.ఓ’ సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా విడుద‌ల కానుంది. ర‌జ‌నీకాంత్ చేతిలో మ‌రో సినిమా కూడా ఉంది.

సినిమాల‌తోనే బిజీబిజీగా ఉన్న ర‌జ‌నీ తాజాగా రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటన చేసి షాక్ ఇచ్చారు. తన ‘2.ఓ’ సినిమా విడుదలైన అనంత‌రం తాను మరోసారి అభిమానులతో సమావేశమవుతానని, తాను కొత్త‌గా ఏ రంగంలోకీ దిగడం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై వ‌స్తోన్న ఊహాగానాల‌న్నింటికీ చెక్ పెట్టిన‌ట్ల‌యింది.
rajnikant
bad news
political entry

More Telugu News