సక్సెస్ లు వరుసగా వచ్చి పడిపోయింది ఎప్పుడూ లేదు: స్వాతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సక్సెస్ లు వరుసగా వచ్చి పడిపోయింది ఎప్పుడూ లేదు: స్వాతి

  • బుల్లితెరపై .. వెండి తెరపై స్వాతికి క్రేజ్ 
  • తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో గుర్తింపు 
  • కెరియర్ గ్రాఫ్ గురించి స్వాతి
బుల్లితెరపై యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న స్వాతి, ఆ తరువాత వెండితెరపై కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లోను ఆమెకి అభిమానులు వున్నారు. అలాంటి స్వాతి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విషయాలను ప్రస్తావించింది. " సక్సెస్ గ్రాఫ్ తగ్గుతుండటం పట్ల ఎలా స్పందిస్తున్నారు?" అనే ప్రశ్న ఈ ఇంటర్వ్యూలో ఆమెకి ఎదురుకాగా, తనదైన శైలిలో స్పందించింది.

 "నాకు అవకాశాలు తగ్గినప్పుడల్లా ఓ మంచి అవకాశం .. ఓ మంచి సక్సెస్ వచ్చేవి. 'ఆడవారి మాటలకి అర్థాలు వేరులే' .. 'సుబ్రమణ్య పురం'.. స్వామిరారా' హిట్స్ అలా వచ్చినవే. నాకు ఎప్పుడూ కూడా వెంటవెంటనే సక్సెస్ లు వచ్చేయలేదు. ప్రతి సంవత్సరం .. ప్రతి సినిమా .. నాకు సక్సెస్ తెచ్చిపెట్టలేదు. ఒక్కసారిగా సక్సెస్ గ్రాఫ్ పెరగడం .. వెంటనే పడిపోవడం ఎప్పుడూ జరగలేదు. నిదానంగా పలకరించే సక్సెస్ లతో నా కెరియర్ కొనసాగుతూ వస్తోంది" అని చెప్పుకొచ్చింది. 
swathi

More Telugu News