సంక్రాంతికే వచ్చేస్తానంటోన్న 'టచ్ చేసి చూడు'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంక్రాంతికే వచ్చేస్తానంటోన్న 'టచ్ చేసి చూడు'

  • హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ 
  • ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తి
  • జనవరి 13న భారీస్థాయి విడుదల
  • పవన్ .. బాలకృష్ణ సినిమాలతో పోటీ
రవితేజ కథానాయకుడిగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. రాశి ఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మాస్ .. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసుకుని, జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. జనవరి 10న 'అజ్ఞాతవాసి' .. 12న 'జై సింహా' ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. గట్టిపోటీ ఉన్నప్పటికీ రవితేజ రంగంలోకి దిగేస్తున్నాడన్న మాట.     
raviteja
rasikhanna
sheerath kapoor

More Telugu News