Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంజ‌య్ లీలా భ‌న్సాలీని పెళ్లి చేసుకుంటా... బిగ్‌బాస్ ఫ‌న్నీ గేమ్‌లో భాగంగా వెల్ల‌డించిన దీపికా ప‌దుకునే

  • డేట్‌, మ్యారీ, కిల్ గేమ్ ఆడించిన సల్మాన్ ఖాన్‌
  • ఆక‌ట్టుకున్న స‌ల్లూ భాయ్‌, దీపికాల ఆఫ్‌బీట్‌ డ్యాన్స్‌
  • 'ప‌ద్మావ‌తి' ప్ర‌చారం కోసం బిగ్‌బాస్ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన న‌టి
'ప‌ద్మావ‌తి' చిత్రం విడుద‌ల‌వుతుందో లేదో తెలియ‌దు కానీ... ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌టి దీపికా ప‌దుకునే బిగ్‌బాస్ కార్య‌క్రమానికి విచ్చేసింది. ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యాత స‌ల్మాన్ ఖాన్, దీపికాతో ఒక గేమ్ ఆడించాడు. దాని పేరు డేట్‌, మ్యారీ, కిల్‌. ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ, నటులు ర‌ణ్‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌ల‌లో ఎవ‌రితో ఏం చేస్తావో చెప్పాల‌ని దీపికాను అడిగాడు.

అందుకు దీపికా... భ‌న్సాలీని పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది. దానికి కంగుతిన్న స‌ల్మాన్... 'స‌రే! కొన్ని రోజుల వ‌ర‌కైతే ఓకే' అంటూ కౌంట‌ర్ వేశాడు. త‌ర్వాత దీపికా... ర‌ణ్‌వీర్‌తో డేట్ చేస్తాన‌ని, షాహిద్‌ని చంపుతాన‌ని చెప్పింది. షాహిద్ ను ఎందుకు చంపాల‌నుకుంటున్నావని స‌ల్మాన్ అడ‌గ్గా.. అత‌నికి పెళ్లైంది క‌దా?... అంటూ చ‌మ‌త్క‌రించింది. త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి ఆఫ్‌బీట్ డ్యాన్స్ వేశారు. పాట‌కి సంబంధం లేకుండా డ్యాన్స్ వేయ‌డంలో ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డ్డారు.
sanjay leela bhansali
deepika padukone
ranveer singh
shahid kapoor

More Telugu News