మ‌రో ప్రాణాన్ని తీసిన సెల్ఫీ స‌ర‌దా!

  • సెల్ఫీ తీసుకుంటూ జ‌లాశ‌యంలో ప‌డి ఐఐటీ విద్యార్థి మృతి
  • ఉత్త‌రాఖండ్ నుంచి హైద‌రాబాద్‌కు మృతదేహం త‌ర‌లింపు
  • త‌న స్నేహితుల‌తో క‌లిసి జ‌లాశ‌యానికి వెళ్లిన యువ‌కుడు
సెల్ఫీ స‌ర‌దా మ‌రో ప్రాణాన్ని తీసింది. నాగర్‌ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌కు చెందిన నరేన్‌ (20) ఢిల్లీలో ఐఐటీ మొదటి సంవత్సర విద్యార్థి. అత‌డి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని మొజంజాహీ మార్కెట్‌లో నివ‌సిస్తున్నారు. రెండు రోజుల క్రితం త‌న 8 మంది స్నేహితుల‌తో క‌లిసి ఉత్తరాఖండ్‌ జలాశయానికి వెళ్లిన నరేన్‌.. జ‌లాశయంలో పడి గల్లంతయ్యాడు. ఈ వార్త తెలిసిన వెంటనే అతని కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్‌ వెళ్లారు. నరేన్‌ మృతదేహాన్ని ఈ రోజు వెలికి తీశారు. ఆ యువ‌కుడి మృతదేహాన్ని హైద‌రాబాద్‌కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Go Back to Shorts
selfie
youngster died
iit student

More Telugu News