'పద్మావతి' సినిమాపై కీలక నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ సీఎం

'పద్మావతి' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ సినిమాపై రాజ్ పుత్ ల నిరసన జ్వాలలు మాత్రం చల్లారడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ఈ సినిమా యూనిట్ కు షాక్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో సినిమాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్ పుత్ వర్గానికి చెందిన నేతలు ఇటీవలే చౌహాన్ ను కలిసి సినిమాను నిషేధించాలంటూ విన్నవించారు. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల వాయిదా పడ్డప్పటికీ, నిషేధం విధించారు చౌహాన్. మరోవైపు, రాజ్ పుత్ లకు అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించకపోతే సినిమాను అనుమతించబోమని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఇప్పటికే హెచ్చరించారు. 

padmavathi
ban on padmavathi
madhya pradesh

More Telugu News