నిఖిల్ మూవీ నిర్మాతగా ఠాగూర్ మధు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిఖిల్ మూవీ నిర్మాతగా ఠాగూర్ మధు!

  • 'కిరిక్ పార్టీ' రీమేక్ తో నిఖిల్ 
  • నెక్స్ట్ చేయనున్నది 'కణిథన్' రీమేక్ 
  • తెలుగులో తెరకెక్కించేది కూడా తమిళ దర్శకుడే       
ప్రస్తుతం 'కిరిక్ పార్టీ' రీమేక్ లో నిఖిల్ బిజీగా వున్నాడు. ఏకే ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ రీమేక్ తరువాత నిఖిల్ మరో రీమేక్ చేయడానికి సిద్ధంగా వున్నాడు. ఇటీవల తమిళంలో 'కణిథన్' సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఈ సినిమాకి ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించనున్నాడనేది తాజా సమాచారం.

 తమిళంలో ఒరిజినల్ మూవీని తెరకెక్కించిన టి.ఎస్.సంతోష్ తెలుగులోను ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. 'కిరిక్ పార్టీ' షూటింగ్ పూర్తికాగానే, 'కణిథన్' రీమేక్ ను ఆరంభించనున్నట్టు చెబుతున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' .. 'కేశవ' సినిమాలతో నిఖిల్ మంచి హిట్స్  ను అందుకున్నాడు. 'కిరిక్ పార్టీ' రీమేక్ తో హ్యాట్రిక్ హిట్ ను అందుకుంటాననే నమ్మకంతో వున్నాడు. ఇక ఆయన నెక్స్ట్ మూవీకి నిర్మాతగా ఠాగూర్ మధు ముందుకు రావడంతో, ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్టు పట్ల అందరిలోనూ ఆసక్తి మొదలైంది.       
nikhil
thagoor madhu

More Telugu News