వర్మ నాకు చేసిన ప్రామిస్ ఇది... నెరవేర్చుకుంటాడని నమ్ముతున్నా: నాగార్జున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వర్మ నాకు చేసిన ప్రామిస్ ఇది... నెరవేర్చుకుంటాడని నమ్ముతున్నా: నాగార్జున

  • 'శివ' సాంకేతికంగా అత్యున్నతం
  • భారత సినీ సాంకేతిక ప్రమాణాలను పెంచింది 
  • అంతకన్నా టెక్నికల్ వాల్యూస్ కావాలని అడిగా
  • వర్మ హామీ ఇచ్చాడని తెలిపిన నాగార్జున
"రామూ నేను అప్పుడు శివ తీశాము. శివ మేడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నేషనల్లీ... ఒక టెక్నికల్ స్టాండర్డ్. ఈ సినిమా కూడా అలాగే చేసిపెడతావా నాకు? అని అడిగితే... దానికన్నా ఎక్కువ చేస్తానని చెప్పాడు. ప్రామిస్ చేశాడు. సో అయామ్ లుకింగ్ ఫార్వార్డ్. ఐ వాంటూ లెర్న్ న్యూ టెక్నిక్" అని హీరో నాగార్జున తన కొత్త చిత్రం ముహూర్తపు వేదికపై చెప్పారు.

ఇక వర్మ తన మాట నెరవేర్చుకుంటాడని తాను నమ్ముతున్నట్టు నాగ్ తెలిపారు. ఇప్పటికే కొన్ని షాట్స్ గురించి వర్మ చెప్పాడని, అవి అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. తెలుగు సినిమా మరోసారి కొత్త తరహాలో వెళుతూ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని వ్యాఖ్యానించిన నాగ్, ఈ చిత్రాన్ని తాము సరైన సమయంలో ప్రారంభించామని భావిస్తున్నట్టు తెలిపారు. 'నాగ్ ఆర్జీవీ-4' అంటూ తన థంబ్ ను అభిమానులకు చూపించారు.
siva
Nagarjuna
ramgopal varma
company

More Telugu News