రామూ చాలా మాఫియా సినిమాలు చేశాడు... ఇది మాత్రం యునీక్: నాగార్జున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామూ చాలా మాఫియా సినిమాలు చేశాడు... ఇది మాత్రం యునీక్: నాగార్జున

  • రాముతో సంబంధం ఈనాటిది కాదు
  • నమ్మిన విషయం కోసం ఎన్నో త్యాగాలు చేసే పాత్ర ఇది
  • రామూలోని ప్యాషన్ చూస్తుంటే ఎక్సయిటింగ్ గా ఉంది
  • కొత్త సినిమా ప్రారంభోత్సవంలో నాగార్జున
దర్శకుడు రాంగోపాల్ వర్మకు, తనకు ఉన్న సంబంధం ఈనాటిది కాదని హీరో నాగార్జున వ్యాఖ్యానించాడు. ఈ ఉదయం వీరి తాజా చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అన్నపూర్ణా స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నాగ్ మాట్లాడుతూ, వర్మను పొగడ్తల్లో ముంచెత్తాడు. రామూ చాలా మాఫియా సినిమాలు చేశాడని, యాక్షన్ ఫిల్మ్ లు చేశాడని గుర్తు చేస్తూ, ఇది మాత్రం చాలా యునీక్ సబ్జెక్టని అన్నాడు.

ఇందులో కాన్సెప్టే చాలా వినూత్నంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇందులోని క్లాష్, తన క్యారెక్టర్, ఒక విషయాన్ని నమ్మితే దానికోసం చేసే త్యాగాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని చక్కగా చూపించనున్నామని అన్నాడు. దేనికైనా వెనుకాడని క్యారెక్టర్ ఇదని, తాను చేసిన పాత్రలో ఇది ఓ అద్భుతమైనదని చెప్పుకొచ్చాడు. రామూలోని ప్యాషన్ చూస్తుంటే, చాలా ఎక్సయిటింగ్ గా ఉందని, ఈనెలలో 10 రోజులు షూటింగ్ చేస్తామని, ఆపై అఖిల్ సినిమా చూసుకుని, డిసెంబర్ లో తిరిగి షూటింగ్ ప్రారంభించి, త్వరగా ఫినిష్ చేసి విడుదల చేస్తామని అన్నాడు.
Nagarjuna
ramgopal varma
company

More Telugu News