Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బైకుపై అతి వేగంగా వ‌చ్చి ట్ర‌క్కు కింద ప‌డ్డ యువ‌కుడు.. సీసీ కెమెరాలో రికార్డు!

  • తీరు మార్చుకోని యువ‌త‌
  • అతివేగంగా వెళ్లి తీవ్ర‌గాయాల పాల‌యిన యువ‌కుడు
  • ఉత్త‌రాఖండ్‌లోని ఫైతోర‌గ‌ఢ్‌లో ఘ‌ట‌న‌
వేగం క‌న్నా ప్రాణం మిన్న అంటూ ట్రాఫిక్ పోలీసులు ఎంత‌గా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ప్ప‌టికీ యువ‌త మాత్రం త‌మ తీరును మార్చుకోవ‌డం లేదు. ప‌ర్య‌వ‌సానంగా ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. ర‌ద్దీగా ఉండే ర‌హదారుల‌పై, ఇరుకైన రోడ్డుల‌పై కూడా యువ‌త అతివేగంగా వెళుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. చివ‌ర‌కు త‌ల్లిదండ్రుల‌కు క‌న్నీరును మిగుల్చుతున్నారు. ఉత్త‌రాఖండ్‌లోని ఫైతోర‌గ‌ఢ్‌లో ఓ యువ‌కుడు మితిమీరిన వేగంతో వ‌చ్చి ట్ర‌క్కు కింద ప‌డిపోయిన ఘ‌ట‌న సీసీ కెమెరాలో రికార్డైంది. అతి వేగంతో వ‌చ్చిన ఓ యువ‌కుడు ఓ ట్ర‌క్కుకు ఎదురుగా వెళ్లి త‌న బైకుని అదుపు చేయ‌లేక ప‌డిపోయాడు. దీంతో అత‌డికి తీవ్ర గాయాల‌య్యాయి.    




accident
cc camera
bike

More Telugu News