సంజయ్ లీలా భన్సాలీ తల నరికేస్తాం : రాజ్ పుత్ కర్ణిసేన
- దీపికా పదుకునే తలకు 5 కోట్లు వెల కట్టిన రాజ్ పుత్ కర్ణి సేన
- ముక్కు, చెవులు కోస్తామని హెచ్చరిక
- సినిమా విడుదల ఆపకుంటే సంజయ్ లీలా భన్సాలీ తల నరుకుతామని వార్నింగ్
ఇక ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతకు వార్నింగులు మరింత ఎక్కువయ్యాయి. భన్సాలీ తల నరికేస్తామని రాజ్ పుత్ కర్ణి సేన హెచ్చరించింది. సినిమా విడుదలను తక్షణం నిలిపేయాలని సూచించారు. కాగా, దీపికా పదుకునే తల నరికితే 5 కోట్లు ఇస్తామని ఇప్పటికే ఈ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె ముక్కు, చెవులు కోస్తామని కూడా హెచ్చరించారు.