భారత్ లో లీటర్ పెట్రోలు 300 రూపాయలు కానుందా?
- సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం
- యుద్ధం మొదలైతే క్రూడ్ ఆయిల్ పై ప్రభావం
- లీటర్ పెట్రోలు 300 రూపాయలయ్యే అవకాశం
ఈ క్రమంలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే ముడి చమురు సరఫరా తగ్గిపోతుందని, తద్వారా ధర 500 శాతం పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. దీంతో వివిధ దేశాల్లో ఆయిల్ సంక్షోభం ఏర్పడనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్ లో ప్రస్తుతం 70 రూపాయలకు దొరుకుతున్న లీటర్ పెట్రోల్ ధర 300 రూపాయలు అయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అక్కడితో ఆగిపోతే ప్రశాంతంగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.