'ఇండియన్ 2' షూటింగును శంకర్ ఏడాదిలోనే కానిచ్చేస్తాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఇండియన్ 2' షూటింగును శంకర్ ఏడాదిలోనే కానిచ్చేస్తాడట!

  • 'రోబో' సీక్వెల్ పనుల్లో శంకర్ 
  • తరువాత 'ఇండియన్' సీక్వెల్ పై దృష్టి 
  • ఆ దిశగా ఇప్పటికే మొదలైన పనులు 
  • ఈ సారి ఎక్కువ సమయం తీసుకోడట  
భారీతనం శంకర్ సినిమా ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. ఆసక్తికరమైన కథకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, ప్రేక్షకులను అబ్బురపరచడం ఆయన ప్రత్యేకత. ప్రస్తుతం 'రోబో' సినిమాకి సీక్వెల్ చేస్తోన్న ఆయన, ఆ సినిమా విడుదల తరువాత 'ఇండియన్' సినిమాకి సీక్వెల్ చేయనున్నాడు. ఆ దిశగా సన్నాహాలు మొదలయ్యాయి కూడా.

 సాధారణంగా శంకర్ ఏదైనా ఒక ప్రాజెక్టును సెట్ చేసుకుంటే, అది పూర్తికావడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. దాంతో 'ఇండియన్ 2' కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి అంతే సమయం పడుతుందని కమల్ అభిమానులు అనుకున్నారు.

కానీ 2018 మార్చిలో ఈ సినిమా షూటింగును మొదలెట్టి .. 2019 మార్చి నాటికి పూర్తి చేయాలనే ఆలోచనలో శంకర్ వున్నాడట. ఏడాదిలో ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడని అంటున్నారు.         
shankar
Kamal Haasan

More Telugu News